Verse 1
చిన్ని చిన్ని పిల్లలం - బుల్లి బుల్లి పాపలం
సృష్టికర్త చేతి దివ్వెలం - క్రీస్తు కోవెలకు గువ్వలం ఆ.....
Verse 2
ప్రేమ తోటలోని పువ్వులం - పరిశుద్ధ పరిమళ జల్లులం
ప్రభువు నోటి ప్రేమ పలుకులం - జీవవాక్కు చాటే చిట్టి చిలుకలం ( 2 )
Verse 3
సత్య వాక్కు చాటే పత్రికలం - నిత్యం వెలిగే నీతి దీపికలం
చక్కని ప్రేమను పాడే కోయిలలం - ఎక్కువ దీవెన పంచే కృపావాక్కులం ( 2 )