Verse 1
స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతుల సింహాసనాసీనుడా - 2
స్తుతియింతుము స్తోత్రింతుము సంతోషముతో పొగడెదము - 2
Verse 2
మారాను పోలిన నాజీవితం మధురముగా నను చేసితివీ
మన్నాతో నన్ను తృప్తిపరచే కన్నతండ్రిగా నీవు కాచితివీ - 2 ||స్తుతులకు ||
Verse 3
నా హృదయమే నీకు ఆలయము నా జీవితం నీకంకితము
నీ చరణమే నా శరణమయ్యా నీ మార్గమే నా మోక్షధామం - 2 ||స్తుతులకు ||
Verse 4
హల్లెలూయా... హల్లెలూయా... హల్లెలూయా...