ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన – విలువైన నీ మాటలు
ప్రాణాత్మలను సేదదీర్చు జీవ ఊటలు (2)
మోక్షమునకు చేర్చు బాటలు
పరిశుద్ధతలో పరిపూర్ణుడా – ఉన్నత గుణ సంపన్నుడా (2)
శ్రేష్టుడా... ||ధ్యానించుచుంటిమి||
తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు
వీరిని దయతో క్షమించుము (2)
అని ప్రార్ధన చేసావా బాధించే వారికి (2)
శత్రువులను ప్రేమించుట నేర్పుటకై (2) ||పరిశుద్ధతలో||