Verse 1
మన పాపము మన రోగము - యేసు సిలువలో మోసెను
కలువరి సిలువలో - సాతాను సైన్యమున్ కూల్చివేసెను
Verse 2
యేసు రక్తములో - ముద్రలు పొందిన వారు
బూర ఊదగానే - లోక పునాదులు వణికెన్ ||మన ||
Verse 3
విజయము పొందినరాజు - సైన్యముల ముందు నిలచె
భయము ఏల మనకు - విజయము మనదే నిత్యం ||మన ||
Verse 4
సకల వాయిద్యములతో - ఆయన విజయము పాడి
సంతోష గానములతో - పరిశుద్ధుల మధ్య నిలచి ||మన ||
Verse 5
శత్రు సమూహములన్ని - ఎర్ర సముద్రములో
ముంచి వేయబడగా - శత్రువు క్రియలిక లేవు ||మన ||
Verse 6
జయము జయము జయము - ఎల్లవేళల జయము
యేసు నామమునకే - ఎల్లవేళల జయము ||మన ||