Verse 1
యేసు క్రీస్తు నాకు బలమాయె - నాకెంతో ఆనందం
Verse 2
ఎటుతోచని పరిస్థితిలో - గతిలేదని తలచాను
నా స్థితి గమనించాడు - తన శక్తితో నింపాడు
నా హృదయము ప్రభుదాయె - ప్రభుజీవము నాదాయే ||యేసు ||
Verse 3
దరిలేని లోకంలో - నా గురియై నిలిచాడు
పరుగెత్తెద గురివైపు స్మరియించుచు ఆ నామం
నా హృదయము ప్రభుదాయె - ప్రభుజీవము నాదాయే ||యేసు ||
Verse 4
నా జీవిత కాలమంత - నా యౌవన కాలమంత
ప్రభునామమె పాడెదను - ప్రభుయేసుని ధ్యానింతును
నా హృదయము ప్రభుదాయె - ప్రభు జీవము నాదాయె ||యేసు ||