Verse 1
ఉన్నామయ్యా యేసు ఉన్నామయ్యా
ఈ భువిలో సాక్షులమై ఉన్నామయ్యా ||2||
Verse 2
నీప్రేమను ప్రకటింప నీ మహిమను వివరింప
శిలువ జెండా పట్టుకొని ఈ భువిలో ఉన్నాము ||ఉన్న|| ||2 ||
Verse 3
ఆది దేవుడవంటు అవనిలో వెలిశావంటు
పాప చీకటిని పారద్రోలే వెలుగువంటు ||ఉన్న|| ||2 ||
Verse 4
మా బాధలు మా వ్యాధులు బాపిన దేవుడవంటు
రక్తము కార్చి మాకు రక్షణ ఇచ్చావంటు ||ఉన్న|| ||2 ||