Verse 1
ప్రభువగు యేసు - పిలచెను ప్రేమతో రండి
ఆనందముగా - రక్షణ నొంది పోవుదము
Verse 2
ముండ్ల కిరీటము ముఖమున ఉమ్మియు
మూడు సీలలతో - సిలువలో వ్రేలాడెన్
జీవబలిగా - మరణించె జీవము నిచ్చె ||ప్రభు ||
Verse 3
కానని గొర్రెను - వెదకి రక్షింపన్
కల్వరికొండపై - రక్తము కార్చిన
కాపరి పిలుపు - ద్వనించెన్ పరుగిడి రండి ||ప్రభు ||
Verse 4
ప్రేమ సువార్తను - తెలుపుచునుండ
ప్రేమగల యేసుని - హత్తుకొనండి
కృపకాలమిదే - త్రోవకు త్వరగా రండి ||ప్రభు ||