Verse 1
నా చిన్న జీవితనౌక - నడిచింది నడిసంద్రాన
శోధనా తరంగాలపైన - వేదనా పవనాల నడుమ
Verse 2
తల్లడిల్లిన తనయునిలా - తండ్రి ఒడిలోన ఒదిగిపోనా
సుడిగుండాలు దాటువరకు - సాగింపుము చుక్కానిబట్టి ||నా చిన్న ||
Verse 3
గద్దింపుతో దేవా నీవే - సద్దణపినావా ప్రభువా
సాయంబు నీయగరావా - సొమ్మసిల్లక ముందుకుపోవ ||నా చిన్న ||
Verse 4
సుడిగాలికి ఎదురైనావా - సాగింది పయనం ఓదేవా
నేనోడిపోతిని ప్రభువా - నీవే విజయము చేయరావా ||నా చిన్న ||