Verse 1
క్రొత్తపాట పాడనురారే - క్రొత్త రూపునొందనురారే
హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదం - 4
ప్రభుయేసుకే స్తోత్రం - మన రాజుకే స్తోత్రం || క్రొత్తపాట ||
Verse 2
శృంగనాదం చేయరండి హల్లెలూయ
హోసన్నాయని పాడరండి హల్లెలూయ
ఉల్లసించి పాడరే హల్లెలూయ
ఎల్లరున్ జై కొట్టరే హల్లెలూయ ||హల్లెలూయ ||
Verse 3
అడుగడుగో మన యేసురాజు మేఘంలో
రానైయున్నాడు కొంచెం కాలములో
జేజేలు పాడుచు ఎదురెళదాం
దూతాళివలె నింగి కెగిరెళదాం ||హల్లెలూయ ||
Verse 4
కొంతకాలమే క్రైస్తవుడా యీ కన్నీరు
అంతలో వర్షించునోయి పన్నీరు
ప్రతి బాష్పబిందువు తుడుచునులే
ప్రతినోరు హల్లెలూయ పాడునులే ||హల్లెలూయ ||