Verse 1
కృపానిధివి నీవే యేసయ్యా - దయానిధివి నీవే మెస్సీయ్యా -2
మా కన్న తండ్రివి - మము కొన్న తండ్రివి
మనసున్న తండ్రివి - బహు మంచి తండ్రివి
Verse 2
ఆత్మ దీపము వెలిగించి... అమ్మను మించి లాలించి...
ప్రతీక్షణం పాలించి - వేదనను తొలగించి
కాచిన దేవా - ప్రేమించిన దేవా ||కృపా ||
Verse 3
అన్న పానము సమకూర్చి - ఆప్తుడ నీవై బలపరచి
శోధనను తొలగించి - చింతలను దాటించి
బ్రోచిన దేవా - రక్షించిన దేవా ||కృపా ||
Verse 4
వ్యాధి బాధలు తొలగించి - నీ కౌగిలిలో మము దాచి
శ్రమలన్నీ సహియించి - శిలువలో మరణించి
శాశ్వత రాజ్యం - సమకూర్చిన దేవా ||కృపా ||