Verse 1
గాడాంధకారములో నేను తిరిగిననూ
నేనేల భయపడుదూ నాతోడు నీవుండగా || గాడాంధ ||
Verse 2
ఎన్నెన్నో ఆపదలు - నన్ను చుట్టిననూ
నిన్ను తలచినచో - నన్ను విడనాడు - 2
అన్ని కాలముల - నిన్నే స్మరియింతు - 2
ఎన్నరానివయా - నీకున్న సుగుణములు ||గాడాంధ ||
Verse 3
నాకున్న మనుజులెల్ల - నన్ను విడిచిననూ
నాదేవ ఎపుడైనా - నన్ను విడచితివా - 2
నా హృదయ కలశమున - నిను నేను నిలిపెదను - 2
నీ పాద కమలముల - నాదేవ వ్రాలెదను ||గాడాంధ ||
Verse 4
నా బ్రతుకు దినములలో నిన్నేల మరచెదను
నీ ఘనకార్యముల నేనెపుడు స్మరియింతు - 2
నీ ఉపకారముల నేనెపుడు తలచెదను - 2
నా యేసు పాదముల - నేనెపుడు కొలిచెదను ||గాడాంధ ||