Verse 1
సువర్ణమయమైన స్తుతి ధూమమయమైన
సుందర పరలోకమే మనకు నిత్య రాజ్యము
అ.ఆనందమే ఆనందం - ఉత్సాహమే ఉత్సాహం
సంగీతమే సంగీతం - స్తుతి నాట్యమే స్తుతి నాట్యం
Verse 2
కళ్ళ నుండి కన్నీరు - తనువు నుండి రోగాలు
రానే రాని రాజ్యము - నిత్య సౌఖ్య జీవనము
వెల కట్టలేని సంపద - సిద్ధ పరచెను మనకోసం
మరి నీవూ వారసుడైతివా - పరిశుద్ధత కలిగి నిలిచితివా ||ఆనందమే ||
Verse 3
ఆకలి దప్పికలు - ద్వేషాలు క్రోధాలు
లేనే లేని రాజ్యము - సత్య స్నేహ జీవనము
స్తుతి ధూమం నిత్యం - ఎగసే రాజ్యం
మహిమ స్వరాలే - ప్రభువుకు నైవేద్యం
మరి నీవూ వారసుడైతివా - పరిశుద్ధత కలిగి నిలిచితివా ||ఆనందమే ||