Verse 1
జీవింతును నా జీవితము- యేసుకై జీవింతును
జీవమిచ్చిన ఆ ప్రభువునకు నా జీవితమర్పింతును
జీవింతును జీవింతును యేసుని కొరకే జీవింతును || జీవింతును ||
Verse 2
పరమును వీడిన ప్రభుయేసు - ఇల మన కొరకై జీవించెగా
సిలువలో ప్రాణము సర్పించిన ఆ
ప్రభువును చూచుచూ వెంబడింతును
వెనుదిరుగమెన్నడును యేసునితో ||జీవింతును ||
Verse 3
ప్రభుసేవ బహు భాగ్యములే - శ్రమయైనను అది సంతోషమే
ఉన్నతమైన పిలుపుకు లోబడి
వెనుక ఉన్నవన్నియు మరచి
గురివైపు పరుగిడెదం యేసునితో ||జీవింతును ||