Verse 1
క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా - నీ రాక ఏక్షణమో
నా కన్నీర్ తుడుచుటకు - నన్నాదరించుటకు
నా యేసువా మేఘములపైనా - వేవేగ రారమ్ము || క్రీస్తేసువా ||
Verse 2
మధ్యాకాశంలో పరలోక దూతలతో వచ్చేవేళ
నా కొరకు గాయపడిన ఆమోమున్ ముద్దాడుటకు
నీటి కొరకై వేచిన గూఢబాతులా వాంచించెదన్ ||క్రీస్తేసువా ||
Verse 3
ధవళవస్త్రం ధరియించిన పరిశుద్ధుల సంఘమది
నీ దరికి చేరినేను హల్లెలూయ పాడుటకు
బుద్ధిగల నిర్మల కన్యను పోలి సిద్ధపడెదన్ ||క్రీస్తేసువా ||
Verse 4
సూర్యచంద్ర తారలనే దాటి పరదైసులో
ఆ స్పటిక నది తీరాన జీవవృక్ష నీడలో
నిత్యమైన నివాసం చేరుటకు వేచియుంటిన్ ||క్రీస్తేసువా ||