Verse 1
కృపవెంబడి కృపను - నాపై కురిపించినావు
నీకృపలో - నీకృపలో - యేసయ్యా నీకృపలో
నీకృపలో నన్ను మురిపించుచున్నావు
నన్ను వెలిగించుచున్నావు - నన్ను నడిపించుచున్నావు || కృప ||
Verse 2
మునుపటి కంటె అధికముగా - నీకృప నాపై కురిపించినావు
నా సరిహద్దులన్నియూ - విశాలము చేసినావు
శాశ్వతమైన నీకృపలో ||నీ కృప ||
Verse 3
ముప్పది అరువది నూరంతలుగా - నీ కృప నాపై కురిపించినావు
నా మార్గము లన్నింటినీ - సరాళము చేసినావు
అమూల్యమైన నీకృపతో ||నీ కృప ||
Verse 4
నా ఊహలకన్నా అమితముగా - నీకృప నాపై కురిపించినావు
నా ప్రార్థనలన్నింటినీ సఫలము చేసినావు
ఉన్నతమైన నీకృపతో ||నీ కృప ||