కనికరమే చూపని మహా మొండి లోకమని
తెలుసుకొంది నామది నీ ప్రేమను కని
ఆహా! ఎంత ప్రేమయ్యా నీది - ఆహా! ఎంత జాలయ్యానీది యేసయ్యా
ఆహా! ఎంత కరుణయ్యానీది - ఆహా! ఈ ధన్యత చాలినది
అర ఘడియైనా - కన్నుమూయక - నను చూచు ప్రేమ
అణు మాత్రమైనా - నొప్పించని - మృదువైన ప్రేమ
నీ చల్లని పిలుపుతో నను బంధించి - నీ సిలువ బాటలోకి నన్ను మరల్చితివి
మలచితివీ బలపరచితివీ - నీ సత్యమార్గములో స్థిరపరచితివి
చాలయ్యా నీకృప చాలయ్యా - 2 ||ఆహా ||
నీ రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చి - నీవే పోషణ చేసి ఆకలి తీర్చితివి
పిలిచితివి - కన్నీరు తుడిచితివి - నీ దివ్య మహిమతో వెలిగించితివి
చాలయ్యా నీకృప చాలయ్యా - 2 ||ఆహా ||
ప్రేమరహిత బంధుమిత్ర సోదరులంతా
నా కష్ట సమయములో చేయి విడిచినపుడు - ఓదార్చీ - నీ ఒడిచేర్చీ
నీ అభయ హస్తముతో మేలు కూర్చితివి
చాలయ్యా నీకృప చాలయ్యా - 2 ||ఆహా ||