Verse 1
కనుగొంటిని నేడు కనుగొంటిని
నీ రక్షణే నాకుమేలని - నీసన్నిధేనాకుచాలని
Verse 2
నా హృదయం మత్సరపడెను - మిడిసిపడే లోకము చూచి
నా అంతరింద్రియం వ్యాకులపడెను - పరుగులిడే పాపులచూచి
ప్రార్ధించితిని నీ సన్నిదిలో - నిలుపుకుంటి నిన్నే నామదిలో - 2 ||కను ||
Verse 3
లోకమందు నీవు తప్ప ఎవరున్నారు
నీకన్నా నాకేదీ ముఖ్యము కాదు - 2
(నీ) ఆలోచన చేత నన్ను నడిపించెదవు
ఆపై నీ మహిమలో చేర్చుకొందువు ||కను ||
Verse 4
పద్యం: క్రోధసంభూత మానస లోకమందు
కుఠిల సంచార ప్రేతల సమాజమందు
సజీవ సాక్షిగా నన్నుంచినావు
నీ వాక్యమీధరలో పంచిఇవ్వ