Verse 1
నా ప్రాణప్రియుడా నా యేసు ప్రభువా
నా జీవితం అంకితం - నీకే నా జీవితం అంకితం
Verse 2
నీ సత్యము సమాజములో - నీ నీతిని నా హృదయములో
దాచియుంచలేను ప్రభూ
స్తుతియాగముగా నూతన గీతము నే పాడెదన్ ||నా ప్రాణ ||
Verse 3
జ్ఞానులకు నీ సందేశం - మత కర్తలకు నీ ఉపదేశం
అర్ధముకాకపోయెనే
పతితలెందరో నీ జీవజలము త్రాగితిరే ||నా ప్రాణ ||
Verse 4
మా పితరులు నీయందే నమ్మికయుంచి నడిచిరిగా
వారు నీకు మొఱ్ఱపెట్టగా
వారిని రక్షించి శాశ్వత కృపను చూపితివే ||నా ప్రాణ ||
Verse 5
నాశనకరమైన గుంటనుండి - పాపపుదొంగ ఊబినుండి
నన్ను లేపి నిల్పితివే
నా పాదములు క్రీస్తనే బండపై స్థిరపడెనే ||నా ప్రాణ ||
Verse 6
నాయెడ నీకున్న తలంపులు - బహువిస్తారములై యున్నవి
వాటిని వివరించి చెప్పలేనే
అవియన్నియును లెక్కకు మించినవైయున్నవి ||నా ప్రాణ ||