Verse 1
వనితా క్రైస్తవ వనితా - క్రీస్తే నీకు ఘనత
కలదు నీకెంతో బాధ్యత - కలదు నీకెంతో ధన్యత
Verse 2
ధర క్రీస్తు సంఘమునందు వికసించిన కుసుమము నీవు
క్రీస్తేసు పరిమళములను వెదజల్లుము నిరతం నీవు ||వనిత ||
Verse 3
సుగుణాల రాశివి నీవు - విలువైన ముత్యము నీవు
ప్రభువిచ్చిన రక్షణ దీపం వెలిగించు నీ గృహమందు ||వనిత ||
Verse 4
ప్రియుడేసుని ప్రేమామృతము అందించు పాత్రవు నీవు
సువార్తకు పుత్రిక నీవై సంపాదించుము ఆత్మలను ||వనిత ||
Verse 5
వరుడేసుని రాకడ త్వరితం వేయాలి ప్రార్ధన ధూపం
పరిశుద్ధాలంకారముతో వధువై సంసిద్ధముకమ్ము ||వనిత ||