Verse 1
అంకితం నా జీవితం - నీ కొరకే స్వామీ నీకొరకే స్వామీ
Verse 2
అంకితమయ్యా ఆత్మశరీరము - అర్పింతును నా హృదయార్పణము
అందుకొనుము నా వందనమయ్యా ||అంకితం ||
Verse 3
శోధన గాధలు వ్యాధులు కల్గిన బాధలెన్నో
తొలగించితివి - నీ పాదసేవయె నాదుజీవితం ||అంకితం ||
Verse 4
కన్నతల్లి కన్నను మిన్నగ - అన్నిటిలోన కాపాడితివి
అన్నియూ నీకే అర్పణమయ్యా ||అంకితం ||
Verse 5
కాచితివి గతవత్సరమంతయు - జీవితమంతయు
క్షేమముగాను - నూతన శుభాకాంక్షలతో ||అంకితం ||
Verse 6
పావనమయ్యెను నా జీవితము - నీ జనములో
నిఖిల జగంబులు నీ శుభవార్తను చాటింతుమయ్యా ||అంకితం ||