Verse 1
మధుర మధుర మధుర సేవ - యేసుప్రభుని సేవ || మధుర ||
Verse 2
దేవ దూతలకును లేని - దైవజనుని సేవ
దేవ సుతుని సంఘసేవ - దివ్యమౌ సువార్త సేవ ||మధుర ||
Verse 3
పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే - ప్రజ్వరిల్లు సేవ
పరిమళించు వాక్యసేవ - ప్రతిఫలించు సాక్ష్య సేవ ||మధుర ||
Verse 4
ప్రభుని చేర ప్రభుని ఎదుట - ప్రవచనాల సేవ
ప్రజల పేర ప్రభుని ఎదుట - ప్రార్ధనలు వచించు సేవ ||మధుర ||
Verse 5
భాగ్యభోగ నిధులు లేని - భారభరిత సేవ
భాష్ప సిరులలోన మెలగి - బాధలను వరించుసేవ ||మధుర ||
Verse 6
సిలువ మూర్తి కృపల జాట - సిగ్గుపడని సేవ
సిలువ నిందలనుభవింప - శిరమువంచి మురియు సేవ ||మధుర ||
Verse 7
దైవ జనుడ మరువకోయి - దైవ పిలుపు నోయి
దైవనీతి వదలకోయి - దేవుడు దీవించు నోయి ||మధుర ||