Verse 1
కొరగాని నన్ను కూరిమితోడ కొడుకని పిలిచావు
అర్హత లేని అధముడ నన్ను ఆదరించావు
Verse 2
ఏ ఆశ లేదని నిరాశచెంది కుమిలిన వేళలో
బతుకుకన్నా చావు మేలని తలచిన వేళలో
జాడలేని దూర తీరాన నన్ను వెదికావు చేరదీశావు ||కొరగాని ||
Verse 3
కడగండ్లు నాపై జడివానలాగా కురిసిన వేళలో
పరిమితి లేని పాప పాశాలు చుట్టిన వేళలో
కరుణ చూపే సిలువ ప్రేమ నన్ను తాకింది
కలువరిగిరి కరుణధామం నన్ను చేరింది నన్ను చేరింది ||కొరగాని ||
Verse 4
నిబిడాంధకార నిశీధిలోన దీపము చూపావు
వెలుగును నింపావు