Verse 1
కోటి కంఠాలతో - నిన్ను కీర్తింతును
రాగభావాలతో - నిన్ను ధ్యానింతును
గాత్రవీణలే మీటి నేను పాడనా
స్తోత్ర గీతమే బ్రతుకంత నేపాడనా
Verse 2
రాగాలు నేను కూర్చనా - స్తుతిగీత నాదాలు నే పాడనా
హృదయమే నీ ఆలయం
నాలోన వశియించు నా యేసువా ||కోటి ||
Verse 3
యాగంబునై నేను వేడనా
సనుతించు గీతాలు నే పాడనా
జీవితం నీ కంకితం స్తుతియాగమై నేను కీర్తించెదన్ ||కోటి ||
Verse 4
సువార్త నేను చాటనా - నీ సాక్షిగా నేను జీవించనా
పానార్పణముగ - కోయబడిన
నన్నిలలో నడిపించు నా యేసువా ||కోటి ||