Verse 1
యెహోవా నీ ముఖకాంతిని - చూచి నడచుచున్నాను
నీ నామమును బట్టి హర్షించుచున్నాను
Verse 2
నీ కృపాతిశయమును - నిత్యము కీర్తింతును
నీదు విశ్వాస్యతన్ తరతరము ప్రకటింతును ||యెహోవా ||
Verse 3
నీ ధర్మశాస్త్రము యదార్ధమైనది - ప్రాణమును తెప్పరిల్లజేయును
నీ ఉపదేశము నిర్ధోషమైనది - హృదయమును సంతోషపరచును ||యెహోవా ||
Verse 4
నీ ధర్మము నిర్మలమైనది - కన్నులకు వెలుగు నిచ్చును
నీ భయము పవిత్రమైనది - నిత్యము నిలచును... ||యెహోవా ||