Verse 1
అర్పింతును దేవా నా సమస్తమును
నీ సన్నిధిలో సజీవ యాగముగా || అర్పింతును ||
Verse 2
దుర్నీతి సాధనములై బహుదోష భరితమైన
నా అవయవములన్నియు - నీతికి సాధనములుగా
ఘనమగు నీ పనికొరకే అర్పించితి యేసయ్యా ||అర్పింతును ||
Verse 3
అపవిత్రమైన ఈ పెదవుల్ నీ సత్యవార్త చాటన్
విననొల్లని ఈ చెవులు నీ స్వరము వినుటకును
అర్పించితి యేసయ్య నీ అగ్నితో కాల్చుమయా ||అర్పింతును ||
Verse 4
గతియించే లోకములో నశియించే ఆత్మలకై
వెతికె నేత్రమ్ములను వేదనపడు హృదయమును
పొందుటకై ఈ నేత్రములన్ హృదయము నర్పణ చేతున్ ||అర్పింతును ||
Verse 5
సింహాసన మహిమనుండి సిలువ మరణమునకు
విధేయత చూపిన నీ మనసును పొందుటకు
అర్పింతును యేసయ్యా అస్థిరమగు నా మనస్సు ||అర్పింతును ||
Verse 6
పరిశుద్ధమైన అనుకూలమైన
సజీవయాగముగా నా శరీరమును
సమర్పించుటయే నీకు బహుయుక్తమైన సేవ ||అర్పింతును ||