ఎక్కలేనంత ఎత్తైన కొండ
ఎక్కించు వారు లేరెవ్వరు
కొండల తట్టు నా కన్నులెత్తి
నిరాశలో నిన్నే పిలిచాను
చీకటి తొలగించి నీ ప్రేమతోనే
నా హృదయమును నింపావు
లేఖనాలన్ని నెరవేర్చినావు
యేసు రాజా నీవే నా ఆశ
ఊహించలేని నీ గొప్ప కృపను
సమృద్ధిగానే పొందితిని
యుగముల రాజా మహిమను వీడి
అవమానమునే భరియించావు
సిలువలో నేను క్షమనే పొందాను
నీ సొత్తుగా నన్నే మార్చావు
నా రక్షకా నీ వాడను నేను
యేసు రాజా నీవే నా ఆశ
హల్లెలూయా నిన్నే ఆరాధింతును
హల్లెలూయా మరణమునే గెలిచావు
బంధకాలను తెంచావు
నీ నామములో రక్షణ
యేసు రాజా నీవే నా ఆశ (2)
వచ్చింది ఉదయం నెరవేరే వాగ్ధానం
సమాధిలో దేహం ఊపిరి పీల్చెన్
మరణముకు నాపై అధికారం లేదని
మౌనమునే వీడి చాటించావు (2)
యేసు.. నీదే విజయము
హల్లెలూయా నిన్నే ఆరాధింతును
హల్లెలూయా మరణమునే గెలిచావు