Verse 1
మనకాలం తండ్రి స్వాధీనం
మన జీవనం ప్రభు ఆధీనం
Verse 2
సృష్టికి కర్తయు శక్తిమంతుడును
తనహస్తముతో చేసిన సర్వము - 2
ఆయనకే స్తుతి మహిమని పాడగ - 2|
ఆలపించు నవజీవన రాగము - 2 ||మనకాలం ||
Verse 3
ఫలియించుటకు నిలిచియుండుటకు
నిజరక్షకుని నియమిత కాలము - 2
సకల జనులకిది విడుదల కాలము - 2
త్వరపడు మిదియే కడవరికాలము - 2 ||మనకాలం ||
Verse 4
ఆ ముఖ కాంతిలో వెడలిన శుభకాలం
ఇదియే దేవుని కృపావరం - కృపావరం