Verse 1
నా ప్రియ యేసురాజా - ఆదుకో నన్నిపుడు
శోధనలో వేదనలో - నిను వీడిపోనీయకు
Verse 2
కలుషితమగు ఈ లోకం - కదిలెనునా కన్నులలో
మరణ శరీరపు మరులే - మెదలెను నా హృదయములో
కల్వరిలో! ఆదరించు! ఆదరించు! ఆదరించు! ||నా ప్రియ ||
Verse 3
మరచితి నీ వాగ్ధానం - సడలెను నా విశ్వాసం
శ్రమల ప్రవాహపు సుడులే - వడిగానను పెనుగొనగా
కల్వరిలో ఆదరించు! ఆదరించు! ఆదరించు! ||నా ప్రియ ||
Verse 4
నేరములెన్నో నాపై - మోపెను ఆ అపవాది
తీరని పోరాటములో దూరముగా పరుగిడితి
కల్వరిలో ఆదరించు! ఆదరించు! ఆదరించు! ||నా ప్రియ ||