Verse 1
నీ నామమే పాడెదన్ - దేవా నీ వాక్యమే చాటెదన్
అ.ప.: ప్రేమా పూర్ణుడా - నా ప్రాణనాధుడా
Verse 2
హీనుడనై నీ దారి నెరుగక - దూరముగా నే పోగా
దీనుడవై నా దారివి నీవై
భారము మోసితివే - తీరము చేర్చితివే ||ప్రేమా ||
Verse 3
సత్యము నమ్మక గమ్యము గానక - అమ్ముడు పోతినయ్యా
సత్యము నీవై బెత్తము చూపక
నెత్తురు కార్చితివే - నా మత్తును బాపితివే ||ప్రేమా ||
Verse 4
చచ్చిన నాకు నిత్యత్వము నియ్యా - నిచ్చెన వైతివయ్యా
మృత్యుంజయుడా పచ్చని నీ ప్రేమ
ఎచ్చట చూతునయ్యా - నా ముచ్చట నీవేనయ్యా ||ప్రేమా ||