Verse 1
గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని
నన్ను కొనిపోవ రానైయున్న
ప్రాణప్రియుడా యేసయ్యా (2)
నిన్ను చూడాలని...
నా హృదయమెంతో ఉల్లసించుచున్నది (2)
ఉల్లసించుచున్నది... ||గగనము||
Verse 2
నీ దయా సంకల్పమే – నీ ప్రేమను పంచినది
నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది (2)
పవిత్రురాలైన కన్యకగా – నీ యెదుట నేను నిలిచెదను (2)
నీ కౌగిలిలో నేను విశ్రమింతును (2) ||గగనము||
Verse 3
నీ మహిమైశ్వర్యమే – జ్ఞాన సంపదనిచ్చినది
మర్మమైయున్న నీవలె రూపించుచున్నది (2)
కళంకములేని వధువునై – నిరీక్షణతో నిన్ను చేరెదను (2)
యుగయుగాలు నీతో ఏలెదను (2) ||గగనము||
Verse 4
నీ కృపా బాహుళ్యమే – ఐశ్వర్యమునిచ్చినది
తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది (2)
అక్షయమైన దేహముతో – అనాది ప్రణాళికతో (2)
సీయోనులో నీతో నేనుందును (2) ||గగనము||