Verse 1
యెహోవా నీవే నా ఆశ్రయం - ఆధారం
వేటగాని ఉరిలోనుండి - విడిపించినావే
నాశనకరమైన తెగులును - రాకుండజేసితివే
దీర్ఘాయువుచేత నన్ను - తృప్తిపరతునని
గొప్పచేతునని అభయమందించినా
పాప్పా మగగసా స్సానిసాగా - పపమగగస ||2||
సగమపా - గా గమాపనీ మా ||2||
సగమ - గమప - మపని - పనీస
సగసగనీ - సగమపగ - సగసగనీ - పమగమప ||2||
Verse 2
రాత్రికలుగు భయమునకైనా - పగలు ఎగురు బాణముకైనా
చీకటిలో సంచరించు - ఎటువంటి తెగులునకైనా
మధ్యాహ్నమందున - పాడు చేయురోగముకైనా
జడియకుము నేనున్నానని - గొప్ప అభయమందించిన ||యెహోవా ||
Verse 3
వేయిమంది నీ ప్రక్కపడినా-పదివేలుగ కుడిప్రక్కకూలినా
ఆపదలు ఏ అపాయములు నీ దరికి చేరలేవు
నిన్ను కాచి కాపాడుటకు నా దూతల కాజ్ఞాపింతును
కనుక నీవు భయపడవలదని వాగ్ధానమిచ్చిన ||యెహోవా ||