Verse 1
తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే
ఆటలు పాటలు ఇక్కడేగా
ఆడుదాం కొనియాడుదాం
పాడుదాం నాట్యమాడుదాం (2)
హల్లెలూయా ఆనందమే
హద్దులేని సంతోషమే (2) ||తండ్రి||
Verse 2
వేచియుండి కనుగొంటిరి
కన్నీరంతా తుడిచితిరి (2) ||ఆడుదాం||
Verse 3
పరిశుద్ధ ముద్దు పెట్టి
పాపాలన్ని తొలగించెను (2) ||ఆడుదాం||
Verse 4
పాపానికి మరణించి
క్రొత్త రూపం పొందితిని (2) ||ఆడుదాం||
Verse 5
ఆత్మ అనే వస్త్రమిచ్చె
అధికార బలమును ఇచ్చె (2) ||ఆడుదాం||