Verse 1
లయమైపోవు లోకములో నేను పడకుండా
నిత్యము నన్ను నీ ఆత్మతో నింపి నడిపించుము
దేవా నింపి నడిపించుము
ఓ... ఓ... ఓ... యేసయ్యా - నీవే నామార్గము
Verse 2
నీమాటచేత నను బ్రతికించి జీవము నిచ్చితివి
నా హృదయములో నిను ప్రేమించి నీకై నిలచితిని
మరణముపై విజయమునిచ్చి నాభయమును తీర్చుమయా ||లయమై ||
Verse 3
మానవులంతా నను విడిచినను నాతో నీవుంటివి
పాపము విడచి పరమును చేర నిన్నే కోరితిని
నీ వెలుగులోనే నడుచుటకు కాపరివై నడిపించుము ||లయమై ||
Verse 4
నీ దాసులకై దివినుండి భువికి వేగమె రానుంటివి
ప్రత్యేక పరచి నీ చిన్నమందలో నను చేర్చుకొంటివిగా
నను నీకై సమర్పించి నేడు నీయందే ఆనందింతును ||లయమై ||