Verse 1
ప్రభుని సువార్త చాట పదవేరా ముందుకు
కష్టానష్టా లెన్నివచ్చి కలవరంబులు కల్గినా || ప్రభుని ||
Verse 2
ఇరుకు మార్గమున యాత్రసల్పగా కట్టర కంకణ మీదినం
క్రీస్తే ప్రభువని కొలువుమురా ప్రభువే యేసని పాడుమురా ||ప్రభుని ||
Verse 3
ప్రభుని వాక్యమే పదును ఖడ్గముర పదరా ముందుకు సోదరుడా
కుటిల కుఢ్యములను కూల్చుమురా క్రీస్తే రక్షణ నిచ్చునురా ||ప్రభుని ||
Verse 4
జీవ వాక్యమును తినుచు బ్రతుకుముర జీవితమే ఒక సాక్ష్యమురా
సిలువను మోయుచు సాగుమురా ఆత్మలకై పోరాడుమురా ||ప్రభుని ||