Verse 1
యెహోవ నా దుర్గము నా గానము - ఆయనే నాకు రక్షణాధారము
Verse 2
ఉత్సాహకరమైన సునాద గీతము - ఎప్పుడు నా నోట పలికించువాడు
దక్షిణ హస్తము నా వైపు చాపి - సాహస కార్యములు చేయించువాడు ||యెహోవ ||
Verse 3
నేను చేసిన విన్నపములన్నియు - అవశ్యముగా ఆలకించును
సంకల్పితుడు నెరవేర్చువాడు - సకల మహిమకు పాత్రుడు ||యెహోవ ||
Verse 4
మరణ బంధములు చుట్టినను - పాతాళ వేదనలు పట్టిననూ
శ్రమయు దుఃఖము కలిగిననూ - క్షేమము నాకు దయచేయువాడు ||యెహోవ ||