Verse 1
సంతసించును మా హృదయాలు - క్రీస్తుతో నడయాడన్
ప్రేమమయుడు యేసురాజు ప్రేమతో మము పిలువన్
శోధన శ్రమలలో - క్రీస్తు యేసుతో సాగెదము
Verse 2
స్థిర పునాదిగ యేసే మూల రాయిగా నిలచెనుగా
చేర్చబడెను ఆత్మలెన్నో క్రీస్తుదేవుని సంఘముగా ||సంత ||
Verse 3
రమ్య మందిరమునకు యేసుడే నిర్మాణకుడు
పిలిచె యేసు ప్రేమతోడ - మనము జత పనివారముగా ||సంత ||
Verse 4
తరుణమిదె పరికించ - తెల్లబారిన పంటదిగో
ప్రాంతీయ పొలములందు - పనలు మోయుచు సాగెదము ||సంత ||
Verse 5
సర్వలోకము నందు కొండ కోనలు సీమలలో
క్రీస్తు వార్త మోసికొనుచు క్రీస్తునే ప్రకటించెదము ||సంత ||