Verse 1
ఆరిపోని జ్యోతిని మాలో - వెలిగించుము దేవా
ఈ ధర నరజ్యోతివి నీవే - వెలుగును ప్రసరించు
మాలో చీకటి తొలగించు - 2
Verse 2
జ్ఞానమును సంపదలు - మనుజులకు నొసంగితివి
నీవులేని జీవితం - జీవించుట వ్యర్ధము ||ఆరిపోని ||
Verse 3
సేవింపన్ ధ్యానింపన్ - పూజింపన్ ప్రార్ధింపన్
జీవితాశ నీవె - యెగ్యుండ విలలో ||ఆరిపోని ||
Verse 4
నా దీపం వెలిగించు - నను నీ సేవలో నుంచు
ప్రజలందరికి వెల్గు - బయలు పర్చెదన్ ||ఆరిపోని ||
Verse 5
చీకటిలో నీ వెల్గు - చూపించు సూర్యుండా
దీప స్తంభముపై - దివిటీగ నుంచుము ||ఆరిపోని ||
Verse 6
మరియ సుత ధరకు పిత - శరణమిదె పరమేశ
కరుణా స్వరూప - కాపాడు మమ్ముల ||ఆరిపోని ||