Verse 1
నీ ప్రేమకు సాటి లేనే లేదు
ప్రేమారూపా యేసురాజా (2)
Verse 2
నింగియందునా – నేల యందునా
పాతాళమందునా – ఎందైన గాని (2)
నీకన్నా అధికులు ఎవరు లేనే లేరు ||నీ ప్రేమకు||
Verse 3
పాపినైన నా కొరకు – పరలోకం విడచినదెవరు
నా పాపముల కొరకై – సిలువలో మరణించినదెవరు (2)
క్షమియించి రక్షించిన నా తండ్రి నీవే ||నీ ప్రేమకు||
Verse 4
ధరలోని ధన ధాన్యములు – నన్ను వీడినా
ఇలలో నా సరివారు – త్రోసివేసినా (2)
ఇహమందు పరమందు నా ధనము నీవే ||నీ ప్రేమకు||