Verse 1
యేసురాజు వచ్చుచుండె హల్లేలూయా
ప్రభుల ప్రభువు వచ్చుచుండె హల్లేలూయా
హల్లేలూయా.... హల్లేలూయా..... హల్లేలూయా... || యేసు ||
Verse 2
ఆర్భాటముతో అరుదెంచును - బూర ధ్వనితో ఏతెంచును
మహిమ శరీరము దాల్చెదము - మహిమలో నిత్యము నివసించెదము ||యేసు ||
Verse 3
బహుమానములు ఎన్నో తెచ్చును - బహుగా తెచ్చును నాకొరకు ఆయనే
కన్నీరంత తుడుచును తానే - కన్నతండ్రిగా నన్ను ఆదరించును ||యేసు ||
Verse 4
ఆనందమే మహదానందమే - ఆహాహాహా ఆనందమే
ఆనందమే ఆనందమే యేసుతో నిత్యము - మహదానందమే ||యేసు ||