విశ్వాసి ఓ విశ్వాసి - నిలబడియున్నావా
విశ్వాసి నీ విశ్వాసంలో - జారిపోయావా ||2||
అంతము వరకు నిలబడువారు దీవెనపొందును ||2||
దైవదీవెన పొందును విశ్వాసి - ఓ... ఓ... ఓ విశ్వాసి ||విశ్వాసి||
అబ్రహామును చూడు - దేవుని మాట నమ్మెను
ఎక్కడికి వెళ్ళవలయునో - తానెరుగకయే వెళ్ళెను
కుమారుని బలియిచ్చుటకు - వెనుతిరుగని విశ్వాసము చూడు
ఆ... విశ్వాసమే విశ్వాసులకు
తండ్రిగా అతనిని మార్చింది ||విశ్వాసి ||
లోకమంతా పాడైనా నోవాహు నీతిని చూడుమా
మాటెవ్వరు వినకపోయినా - దేవుని మాటకు విధేయుడై
నిందలెన్నో భరియించి ప్రభువు మాట నెరవేర్చెను చూడు
ఆ......... విశ్వాసమే కుటుంబానికి రక్షణగా మారెను ||విశ్వాసి ||
యోసేపును - దానియేలును - షద్రకు/మేషాకు అబేద్నెగోలును
ప్రాణాలర్పించుటకైనా - వెనుదిరుగలేదు ప్రభు కొరకు
సింహములబోనులో అగ్నిగుండములో వీరిని చూడు
ఆ..... విశ్వాసమే దేశాధికారులుగా వీరిని మార్చింది ||విశ్వాసి ||