Verse 1
సాగుము సహవాసి ఆగకు విశ్వాసి
జీవిత భానుడు ఎపుడు గ్రుంకునో - తెలియదు పరదేశీ || సాగుము ||
Verse 2
భలేవింత యీ ప్రపంచపుంత
ఎన్నో దారులు - ఎన్నో నీడలు
భ్రమపడి వీడకు - బహుయిరుకైనా తిన్నని రహదారీ ||సాగుము ||
Verse 3
ప్రపంచాన బ్రతుకే ఒక యాత్ర
ప్రాణానికి దేహంబొక పాత్ర
ఎపుడు జీవుడీకట్టె వీడునో - ఎరుగము సహచారి ||సాగుము ||
Verse 4
విడువకు సహవాసం - వినిపించుము ప్రభువాక్యం
నడు నడు ప్రియదేశం నడిపించే ప్రభుకోసం
కల్వరిదారుల క్రీస్తు వెంటబడి అద్దరినే కోరి ||సాగుము ||