Verse 1
దిగిరా..దిగిరా..దిగిరా హే శుద్ధాత్ముడా దిగిరా - 2
పరలోక ఆనందం నా హృది నింపుము
పరిపూర్ణశాంతిని నాలోనుంచుము
నూతనజీవము పంపుము ఆ..... - 2
Verse 2
జీవజలము నాకు ప్రభు త్రాగించుము
శక్తిగల హస్తముతో నను ధైర్యపరచుము
(నా) ఆత్మీయ దాహము తీర్చుము ఆ...... - 2 ||దిగిరా ||
Verse 3
బలమైన ఆహారం భుజియింపజేయుము
నీ దివ్యశక్తితో నను తృప్తిపరచుము
నీ ఆత్మతో బలపరచుము ఆ..... - 2 ||దిగిరా ||
Verse 4
నా గుండె గుడిలో నిత్యము వసించుము
నీ మందిరముగ నేనుండిపోదును
నిను మోయుచు సాగిపోదును ఆ..... - 2 ||దిగిరా ||