Verse 1
నీతిన్యాయములనే జ్యోతులను
నా అంతరాత్మకు రెండు కన్నులుగా చేయుము
అవి నన్ను నిత్యము వెలిగించును
అవి నాలో నీ రూపును చూపించును
Verse 2
కృపా సత్యములనే సుగుణములన్
నా ప్రాణాత్మ దేహములయందు నీవు నింపుము
అవి నన్ను గొప్ప వ్యక్తిగా చేయును
అవి ఆత్మ ఫలములై ఫలియించును
Verse 3
దయా కనికరములనే ధన్యతలు
నే పయనించు మార్గములయందు నీవు మిళితపరచుము
అవి నిత్య జీవ మార్గములో నన్ను నడుపును
అవి జీవ జలపు నదియొద్ద తృప్తి పరచును