Verse 1
నీవిచ్చిన వరమే ఈ జీవితం - నీ సేవకే అంకితం
నీవే పొడిగించిన అయుష్కాలము ప్రభూ జీవింతును నీకోసమే
నన్నింతగా నీవు ప్రేమించుటకు నాకే యోగ్యతలేదు ప్రభూ || నీవిచ్చిన ||
Verse 2
కల కాదు నీ సిలువ బలియాగము అది నా పాప పరిహారము
వెలపోసి నను కొంటివి నీ కోసమే - చిందించితివి రక్తము
నా కోసమే చేసితివి త్యాగము నీకోసమే నిల్తు నీ సాక్షినై ||నీవిచ్చిన ||
Verse 3
పర్వతములు తొలగి పోయినగాని మెట్టలు తత్తరిల్లినా
నా కృప నిను విడిపోదని సెలవిచ్చితివి నీ కరములతో కాపాడితివి
నీవెంతో నమ్మదగిన వాడవు నీ వాగ్ధానం నాయెడ నెరవేర్చితివి ||నీవిచ్చిన ||
Verse 4
నను ప్రేమించిన యేసుని సేవించుచు నా విశ్వాసము కాచుకొనుచూ
మంచి పోరాటమునే పోరాడుచూ పరుగిడెదను నిను చూచుచూ
త్వరలోనే నిను సంధించే కాంక్షతో ధరలో నిరీక్షణతో కొనసాగెదన్ ||నీవిచ్చిన ||