Verse 1
యేసు నీలాంటి దేవుడు జగాన
లేనేలేడు వినుటకైనను ఆ... ఆ.... లేనేలేడు వినుటకైనను
Verse 2
నీకుసాటి ఎవ్వరూ ప్రభో
జగాన కానరారె ప్రభు
ప్రాణరుధిర ధారలు చిందించిన
మధురప్రేమ దాచి నాకు ఇచ్చిన
Verse 3
నీకుసాటి ఎవ్వరూ ప్రభో
మనుజులకై మరణమొందిన
రక్తమిచ్చిరా? వారి ప్రాణమిచ్చిరా?
దేవతలు వినుటకైనను
Verse 4
నీకుసాటి ఎవ్వరూ ప్రభో
కరుణజూపి కనికరించిన
క్షమించుటే పరమార్ధమని తెలిపిన
ప్రేమే శ్రేష్ఠంబని బోధించిన