Verse 1
యెరుగని రీతిగా నన్ను దర్శించె నీ కృప
ఇంతవరకు కాచెనే చెంతనుండి నీ కృప
అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృప
కృపా..... కృపా..... కృపా..... యేసు నీ కృప || యెరుగని ||
Verse 2
గలగలపారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా - 2
శిలయైనా హృది కరిగించెనే వెలయేలేని నీ కృప
కృపా... కృపా... కృపా... యేసు నీ కృప ||యెరుగని ||
Verse 3
పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృప - 2
క్షణమైనా నను యెడబాయక గమ్యము చేర్చే నీ కృప
కృపా... కృపా... కృపా... యేసు నీ కృప ||యెరుగని ||