Verse 1
ప్రేమంటే ప్రేమా అది యేసుప్రేమ ఎక్కడా చూడలేనిది
వేరెవ్వరూ చూపలేనిది - ప్రేమంటే ప్రేమా...
Verse 2
హీనద్రాక్షవల్లినై భ్రష్టసంతానమై పడియున్న నన్ను
పడివెదకిన ప్రేమ, నిట్టూర్పుల ఒరవడిలో కొట్టుకుపోకుండా
జాలి చూపి చేయిచాపి బలపరచిన ప్రేమ
నా మంచి వల్లియని నను పిలచిన ప్రేమ ||ప్రేమంటే ||
Verse 3
అడవి చెట్టు కొమ్మనై చేదురసపు జీవినై
కొట్టివేయబడిన నన్ను పట్టుకున్న ప్రేమ
క్రీస్తు మంచి చెట్టుకు అంటుకట్టబడినాను
క్రొత్తరసం ఇచ్చింది శక్తితో నింపింది
నిత్యజీవమార్గమైన నాయేసు ప్రేమ ||ప్రేమంటే ||
Verse 4
ఎక్కడుంది ఈ ప్రేమ ఒక్క క్రీస్తునందెగా
లెక్కలేని దీవెనలను మరచిపోకు నేస్తమా
చక్కనైన ఈ మార్గం ఎప్పుడు విడనాడకు
ప్రక్కనుండి నడిపించే ప్రభుయేసుని ప్రేమ
తల్లిదండ్రి బంధుమిత్రు లివ్వలేని ప్రేమ ||ప్రేమంటే ||