Verse 1
నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి
నీ ప్రేమ కౌగిలిలో నను ఒదిగిపోనీ
అ.ప.: నీ ఆత్మతో నను నిండనీ - నీ సాక్షిగా ఇలలో నన్నుండనీ
Verse 2
నాలోపల సంచరించి - నాతోభుజియించి
జీవపుమార్గము చూపించి - సరిగానడిపించి
నా జీవితం వెలిగించినావా - నీ రూపమే నాలో ముద్రించినావా ||నా హృదయ ||
Verse 3
బలహీనతలను హరియించి - శక్తితో దీవించి
అజ్ఞానము నిర్మూలించి - సత్యము బోధించి
నా భారమే భరియించినావా - నీ శాంతినే నాలో స్థాపించినావా ||నా హృదయ ||
Verse 4
అనురాగముతో బంధించి - ఆప్యాయత పంచి
ఆనందము ననుగ్రహించి - ఆత్మీయత పెంచి
నా శోకమే తొలగించినావా - స్తుతిగానమే నాలో పలికించినావా ||నా హృదయ ||