Verse 1
నీ ప్రేమే నన్ను ఆదరించెను - సమయోచితమైన
నీకృపయే నన్ను కాచికాపాడెను - నీకృపయే దాచి కాపాడెను
Verse 2
చీకటి కెరటాలలో కృంగిన వేళలో - ఉదయించెను నీకృప నా ఎదలో
చెదిరిన మనస్సే నూతనమాయెనా - మనుగడయే మరో మలుపు తిరిగేనా ||నీ ప్రేమే ||
Verse 3
బల సూచకమైన మందసమా నీకై - సజీవయాగమై యుక్తమైన సేవకై
ఆత్మాభిషేకముతో నను నింపితివా - సంఘ క్షేమమేనా ప్రాణమాయెనా ||నీ ప్రేమే ||