Verse 1
ఎండిన ఎడారి బ్రతుకులో
నిండైన ఆశ నీవేగా
యేసు.. నిండైన ఆశ నీవేగా
తడబడెడు నా పాదములకు
తోడు నీవే గదా
యేసు.. తోడు నీవే సదా ||ఎండిన||
Verse 2
ఎండమావులు చూచి నేను
అలసి వేసారితి (2)
జీవ జలముల ఊట నీవై
సేద దీర్చితివి
నా బలము నీవైతివే
యేసు.. బలము నీవైతివే
Verse 3
నిత్య మహిమకు నిలయుడా నీ
దివ్య కాంతిలోన (2)
నీదు ఆత్మతో నన్ను నింపి
ఫలింప జేసితివే
నా సారధి నీవైతివే
యేసు.. సారధి నీవైతివే
Verse 4
అంధకార లోయలెన్నో
ఎదురు నిలచినను (2)
గాయపడిన నీ హస్తమే నన్ను
గమ్యము చేర్చును
నా శరణు నీవే గదా
యేసు.. శరణు నీవే గదా ||ఎండిన||